శ్రీమాతా కమలాంబిక

(1904-1977)
శ్రీమతి సుంకేశుల రత్నబాల, యం.ఎ;
Shri Matha Kamalambika Garu
సంప్రదాయబద్దమెన కుటుంబాలలొనే నిరంతర దైవచింతన ఉంటుంది, ఇది భారతీయ జీవన సరళి. ఆధ్యాత్మిక జీవనాన్ని ఆలంబనగా చేసుకొని నిరడంబరమైన, నిర్వికార, నిశ్చిల జీవితాన్ని గడిపే మహనీయులు చాలా మంది ఉన్నారు.సామాన్య సంసారులలో కూడా పరిణితి మనస్కులలో మన పూర్వికులు,వేదాంతులు,ఋషులు బోధించిన జీవనసారాన్ని, ఆచార వ్యవహరాలను,కట్టుబాట్లను చూసి ఆనందిచగలుగుతున్నాము. సామాన్యులలో ఆధ్యాత్మిక తత్వాన్ని దీపింప చెయటానికి వెలసిన పీఠం,మధ్యతరగతి కుటుంబాలకు అతి సన్నిహితమైన పీఠం పశ్చిమ గోదావరి ఙిల్లాలొ ఏలూరు బ్రాహ్మణ అగ్రహరములో వెలసిని బాలత్రిపురసుందరి పీఠం.

ఈ పీఠం వ్వవస్టాపకురాలు శ్రీమతి బెహరా కమలమ్మ గారు అధ్యాత్మిక చైతన్యము కలిగిన మహౌన్నతురాలు సామన్యసంసార జీవితం గడుపుతూనే అసామాన్యమైన తాత్విక జీవితాన్ని గడిపిన మహనీయురాలు. ఆమె అశ్రయించిన భక్తులపాలిట కల్పతరువు. దుఁఖాన్ని నివ్రత్తిచేసి, జీవితానికి సుఖాన్ని, శాంతిని ప్రసాదించే సంజీవినీమాత!

ఆమె ఏ ప్రచారానికి ఇష్టపడని నిరాడంబర మహిళ పీఠంలో కార్యక్రమాలు నిరాడంబరంగా జరగాలని ఏవరు వాటిని గొప్పగా ప్రచారాం చెయవద్దని కమలమ్మగారు భక్తులుకు చెబుతూ ఉండేవారు."మీ మీ అనుభవాలను మీ మీ మనసులలోనే దాచుకొని అమ్మవారిని నమ్ముకోండి! అంతా ఆమె చూసుకొంటుంది" అని చెప్పిన మహనీయ వ్వక్తిత్వం కమలమ్మ గారిది.

అంధ్ర సాహితీ శేముషి దురంధరుడు అయిన ఆచార్య మహా మహాపాద్యాయ శ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులు గారి ద్వితియ కూమార్తె శ్రీమతి కమలమ్మ గారు! ప్రతి ఇంటి ముంగిట్లోను ముత్యాల ముగ్గులు ,రంగవల్లికలతో కళకళలాడేరోజు. ప్రతీ ఇల్లు అనంద దరహాసాలతో వింతశోభను సంతరించుకొన్న భోగి పండుగగా అంధ్రులకు సుప్రసిద్దమైన రోజు, ఆ రోజే, అంటే 1904 జనవరి 13వ తేదీన కమలమ్మ గారు జన్మించారు.

ప్రకృతి స్వరూపిణి అయిన జగదంబ తన అంశతో జన్మించడానికి ఇంతకంటే మంచి ముహర్తం ఎమిఉంటుంది? కమలమ్మగారు సాక్షాత్తు "శక్తిస్వరూపిణి". తన జన్మరహస్యం తెలియచేయడానికి ఆమె కుడి పాదంలో చక్రముద్రతో పుట్టారు. శ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులు గారి ఒక వింత అనుభవంద్వారా " నా తర్వాత నా పూజపీఠానికి ఈమే వారసురాలు" అని పలికారు. అప్పటనుండి కమలమ్మగారిలో అమ్మవారిని చూసుకొంటూ బంధువులు, స్నేహితులు అనేక చిత్రమైన అనుభవాలు, అనుభూతులు పొందారు.

కమలమ్మగారికి 8 సంవత్సరాలు రాగానే రజస్వలాపూర్వవిహహం జరిపించాలనే సంకల్పంతో తండ్రి గారు అంబాజిపేట వాస్తవ్వులు శ్రీ బెహరా సుబ్బారాయుడు, శ్రీమతి శేషమ్మ పుణ్యదంపతుల 4వ కుమారుడు అయిన శ్రీ సత్యనారాయణ గారితో విహహం జరిపించారు. ఆ తరువాత కొంతకాలానికి వీరివురు మద్రాసు పట్టణంలోని "తిరువత్తియారు" నందుగల శ్రీ బాలాత్రిపురసుందరీ అమ్మవారిని దర్శించుకున్న పిదప అక్కడే తపస్సు గావించుచున్న శ్రీ బాలాజీ, శ్రీ శ్యామలరావు అను ఇద్దరు యోగిపుంగవులు వీరికి "మంత్రదీక్ష"ను ప్రసాదించారు.నాటి నుండి దంపతులిరివురు దేవినుపాసిస్తూ సుఖజీవనం సాగించారు.

1957వ సంవత్సరంలో అమ్మవారు కమలమ్మగారి కలలో ప్రత్యక్షమై "అన్నపూర్ణా సమేత శ్రీ ప్రతాప విశ్వేశ్వరస్వామి ఆలయ ప్రాంగణములోనే నీ నివాసం, నా నివాసం కూడా! నీకు నా సామీప్యం ప్రసాదిస్తాను.నా భక్తులకు సహయం చేస్తూ, నన్ను సేవిస్తు తరిస్తావు" అని దివించి అంతర్దానం అయ్యింది. కమలమ్మ గారు అమ్మవారి పీఠాన్ని దేవాలయపు సత్రపు గదిలో ఉత్తరముఖంగా దేవాలయంలోని శివునికి అభిముఖంగా ప్రతిష్టించారు.

కమలమ్మగారు గ్రహస్తాశ్రమంలో ఉండి ముక్తి పొంది తరించటయే సులభోపాయమని సన్యాసులుగా జీవించి ఉండవలసిని పనిలేదని స్వయంగా ఆచరించి చూపించారు పీఠం దర్శనానికి వచ్చిన భక్తులకు అమ్మవారిని చూపించి, తమ కోర్కెలను అక్కడ విన్నవిస్తే చాలని తప్పక నెరవెరుతాయని ఆ దేవతా స్తల మహిమ అటువంటిదని చాటి చెప్పారు.భక్తులునుండి ధనం అశించిన యెడల ఆపని వారికి నెరవెరదని కూడ చెబుతూ ఉండేవారు. ఈనాటి వరకు పీఠము అదే నిస్వార్ద సేవలను అందించడం అదొక అద్భుతమైన విశేషం.

తన తరువాత మూడవ తరంలొ పీఠం విస్తరణ విశేషంగా జరుగుతుందని, అంతవరకు గుప్తంగానే ఉంటుందని ముందే చెప్పారు.అందరూ ప్రేమతో మెలగాలి( పూజకార్యక్రమాలు,ప్రసాద వితరణ తదితర విషయాలలో) పదిమంది కలిసి పదిమందికొసం పని చెయడం వలన ప్రేమతత్వం వ్రద్దిచెందుతుందని తాను ఆచరించి భక్తలచే ఆచరింపచేసి,ప్రజలలో ప్రేమతత్వాన్ని పెంపొందింపచేసారు.కులమత భేదం లేకుండా అందరూ పీఠం దర్శించి అమ్మవారి అనుగ్రహంనికి పాత్రులు అవ్వచ్చు అని చెబుతూ అమె కూడ అలాగే వారి ఇళ్ళకు వెళ్ళి వాళ్ళను అనుగ్రహంచేవారు.మూఢచారాలను వదిలి మనసు విశాలం కాలానుగుణంగా నడుచుకొవాలని భోదించారు.

"వక్రము లేని మనసే శ్రీ చక్రం" అని ఉద్బోధిస్తూ మనోనైర్మలాన్ని సాధించడమే ఆధ్యాత్మక ఆచరణమని వివరించారు.ఆర్దికంగాను, ఆధ్యాత్మకంగాను, సామాజికంగా వెనుకబడిన ఎంతొమంది స్త్రీలను తమ ఉపదేశాలద్వార ఆచరణ ద్వారా చైతన్యవంతులని చేసారు. స్త్రీలకు ఆర్దిక స్వాతంత్రం కావాలని చెబూతూ స్వయంగా తన కుమార్తెలను కూడ సుమారు 1950వ సంవత్సరం ముందే స్కూలు ఫైనల్ వరుకూ చదివించి ఉపధ్యాయ వృత్తిలొ ప్రవేశపెట్టారు

తనను అశ్రయించిన వారిని స్వయంగా తీర్దయాత్రలను చేయించడం ద్వారా వారి వారి గ్రహస్ధితులను మెరుగుపరచి మానసిక ధైర్యాన్ని, శక్తిని పెంపొందింపచేస్తూండేవారు.తాను స్వయంగా,మద్రాసు నగర పరమగురువులైన శ్రీ బాలజీ, శ్రీ శ్వామలరావు గార్ల వద్ద మంత్రదీక్షనుపొంది, నియమబద్దంగా అనుష్టించి గురువులయొక్క ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు.

హిందూ ధర్మశాస్ర్తాలని,సామాజిక విలువలను తప్పక పాటించాలని , లేనియెడల సమాజం భ్రష్టుపడుతుందని చెప్పారు. ఆమెకు భర్త వియోగం కలిగిన సందర్భంలో సనాతనమైన హైందవ సంప్రదాయములు సమాజ శ్రేయస్సుకోసం నిర్ణంయించబడ్డాయని వాటి ఉల్లంఘన ద్వారా ప్రజలు క్రమశిక్షణారహితులవుతరని ఉద్ఙాంటిచారు. ఈ సందర్భంలో ఆమె "సంస్కారమే నాకు పసుపుకుంకుమ" "భక్తుల సంక్షేమమే పసుపు పారాణి" " మాత్రత్వమే* నాకు తాళి" అంటూ సాంప్రదాయాన్ని స్వయంగా పాటించి ప్రజలకు మార్గదర్శకులయ్యారు.

సాంస్క్రతిక కార్యక్రమాలు, కళల ద్వారా భగవంతుని చేరడం సులభొపాయమనీ, 64 కళలూ భగవంతునిరుపాలేనని చెబూతూ తానూ స్వయంగా భక్తిగీతాలను వ్రాసి గానం చేస్తూ అమ్మవారని కీర్తించేవారు. ఆ రోజులలో ఆమె హర్మోనియం(వాయిద్యం)ను రెండూ చేతులతో వాయించడం ఒక విశేషం.షోడశ కళానిధి అమ్మవారేనని చెబుతూండేవారు.సాటి మనిసికి ఉపకారము చేయడంలొ ఉన్న సంత్రప్తి, తద్వారా పొందే ప్రతిఫలమే పుణ్యమనీ, జీవితాంతం పుణ్యకార్యాలు చేసి తరించడం ముక్తికి మార్గమని భోధించారు.

1977 వ సంవత్సరం డిసెంబర్ 13వ తేదీ న (మార్గశిర శుద్ద చవితి) బ్రహ్మరంద్రం ద్వారా , ప్రాణోత్ర్కమణం జరిగి ఆమె అనంతశక్తిలో ఐక్యం అయ్యారు. దీనినే శాస్త్రప్రకారంగా కపాలమోక్షం అని కూడ వ్యవహరిస్తారు. ఈ స్థితి సిద్దపురుషులకు,పునీతమైన దైవాంశ సంభూతులకు మాత్రమే సంభవం

అమ్మమ్మ గారి నిర్యాణమునకు ముందే వారి తండ్రిగారైన శ్రీ వెంకటరత్నంగారికి జరిగినట్లుగా తనకి కూడ73వ సంవ్సతరంలో కపాలమోక్షం ద్వారా ప్రాణొత్ర్కమణం జరిగుతుందని ముందుగానే ఆమె శిష్యులకు చెప్పారు.అలా జరగాడన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులంతా దన్యులయ్యారు. ఈ ఉపాసన వంశపారంపర్యంగా తన తండ్రి ద్వారా తనకు సంక్రమించిది అని, తన తరువాత కాలంలో తన ద్వితీయ కుమార్తె బహ్మచారిణి పూజ్యమాత అయిన శ్రీ త్రిపురసుందరి గారికి శ్రీ త్రిపురసుందరీ పీఠం భాధ్యతలను అప్పగించారు. ఆమె అదేశానుసారంగా పూజ్యమాత శ్రీ త్రిపురసుందరి గారు గురువుల ఆశయసిద్దికై సేవా కార్యక్రమాలను ఎంతో బాధ్యతాయుతంగా,నిస్వార్దంగాను చేయుటకు శ్రీకారం చుట్టారు.