శ్రీమాతా త్రిపుర సుందరి

(1938-2006)
శ్రీమతి సుంకేశుల రత్నబాల, యం.ఎ;

Shri Matha Thripura Sundari Garu మలమ్మ సత్యనారాయణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారి పేర్లు రేవతి, త్రిపుర సుందరి, లక్ష్మీసరోజిని. కమలమ్మగారికి ద్వితీయ గర్భం ధరించినది మొదలు ఏవో విచిత్రమైన కలలు వస్తూవుండేవి. ఆమె ఆందోళనచెంది తమ గురువులైన శ్రీ బాలాజీ శ్రీ శ్యామలారావులను ధ్యానించగా, వారు ఆమెకు స్వప్నదర్శ్నమిచ్చి అమ్మవారి అంశతో నీకొక కుమార్తె జన్మించబోతున్నది. ఆమెకు బాలాత్రిపుర సుందరి అని నామకరణం చెయ్యామని సెలవిచ్చారు. ఆశ్చర్యం! ఆమె ప్రసవించిన ఆ స్త్రీ శిశువు నల్లగా రెండు తెల్లని కోరలతో ఉన్నది. తరువాత 21వ రోజున అ కోరలు వాటి అంతట అవే రాలిపొయి సౌమ్యరూపం దాల్చినది. ఆ బాలిక పెరిగి పెద్దదిఅయి పీఠనిర్వహణలో తల్లికి ఎంతగానో తోడ్పడింది. ఆమే త్రిపురాంబ. 1938 సం|| వైకుంఠ ఏకాదశి రోజున జన్మించారు. ఈమె అతితక్కువ వయసులోనే ఎస్.ఎస్.ఎల్.సి. చెసి స్కూలు టీచర్ ట్రైనింగ అయ్యి, "థియోసాఫికల ఎలిమెంటరీ స్కూలు" లో ఉపాద్యాయిని వృత్తిని చేపట్టి. పదవీవిరమణ చేసేవరకు 40 సంవత్సరాలు విద్యార్థులను తీర్చిదిద్ది ఎందరో విద్యార్థులు అత్త్యున్నత పదవులను చేపట్టేందుకు ఎంతగానో తోడ్పడ్డారు.

కులమత విచక్షణ లెకుండ ఎందరొ పేదవిద్యార్ధులకు స్కూల్ ఫీజులు కట్టడం. పాఠ్యపుస్తకాలను కొనిఇవ్వడం, పేదపిల్లలకు వస్త్రములు పంచడం ఆవిడకి పరిపాటి. ఈమె ఆజన్మబ్రహ్మచారిణి, ఈమె భక్తులతో చిన్నపిల్లలతో చిన్నపిల్లవలె, పెద్దవారితో పెద్దవారివలె ఎంతో ఆత్మీయంగా మెలిగే వారు. వారి గురువులైన శ్రీ 'మాతా కమలాంబిక' ఆశయ సిద్దికై నిర్విరామకృషి సల్పారు. ఆర్దికంగా వెనుకబడిన పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు, ఎంతో గుప్తంగా సహాయాన్ని అందిస్తూ, ప్రేమ, దయ, కరుణలతో ఆదుకొని ఆదరించేవారు.

ఆమె చిన్నపుడు వారి తల్లిగారు వుపదేశించిన ఈ నాలుగు సూక్తులను

1. ఎవరిని చేఙాచి ఏమి అడుగరాదు.

2. అందరినీ చిరునవ్వుతో పలకరించాలి

3. మితిమీరి మాట్లాడకూడదు.

4. ఎదుటివారి అవసరాలు గమనించి వారు అడుగకుండానే వారి అవసరాలు తీర్చాలి.

ఙీవితమంతా ఆచరించి, అందరికీ బోథించి ఆదర్శ ప్రాయంగా ఙీవించారు.


ఎందరో భక్తులతో కలిసి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించి, భారతదేశమంతా ఆమె కాలుమోపారు. తనతో తీర్థయాత్రలు చేయలేని భక్తులకు తన తీర్థయాత్రా ఫలితములను ధారపోసేవారు. ఆమె ఇష్టదైవం "కాశీఅన్నపూర్ణా విశ్వేశ్వరులు". ఆమె కార్తీకమాసం 30 రోఙులు (11 సం||ల పాటు) తన నాశ్రయించి వచ్చిన వారందరితో వారనాశిలో గంగాస్నానం, స్వామి దర్శనం చేయిస్తూ ఉండేవారు. పీఠంలో దసరా మహోత్సవములను (10 రోఙులు) గురువులు ఆరాధనోత్సవములను అత్యంత వైభవోపేతంగా ఙరిపేవారు. ఆ సందర్భంగా పేదలకు ఉచిత అన్నదానములు, వస్త్రదానములు, గురుచరిత్ర పుస్తక వితరణలు ఙరుపుతుండేవారు. ఈమె ఎందరో భక్తులను దీర్ఘకాల వ్యాధులనుండి విముక్తి చేయుటకై వారి అనారోగ్యములను తన శరీరముపై వేసుకుని, తన ఙీవిత చివరికాలంలో సుమారు 5 సం||ల పాటు అస్వస్థతతో ఉన్నారు. త్రిపురాంబగారు కుడా తాను సిధ్ధిపోందే ముందు తనను తీసుకువెళ్ళడానికి హిమాలయాల నుండి ఇద్దరు యోగులు వస్తారని అప్పుడే తాను వెళ్ళిపోతాననీ చెప్పారు. అలాగే ఆమె నిర్యాణమునకు ఒకరోఙు ముందుగానే ఇద్దరు వ్యక్తులు (ఒక యోగి ఆత్మకథలోని బాబాజీ, లాహిరి వార్ని పోలిన వారు) వచ్చి "24 గం||లలో ఆమె సిధ్ధిపొందుతారు అని చెప్పారు. సరిగ్గా అదే 24 గం||ల వ్యవధికి ముందే వారు అదే కమలాంబికా ముక్తిధామంలో సిధ్ధిపోందటం ఙరిగింది. ఈ విషయాన్ని అక్కడేవుండి విని చూసిన శిష్యులంతా ధన్యులయ్యారు. ఆరోఙు 2006 మార్చి 3వ తేదీ (ఫాల్గుణశుధ్ధచవితి) మధ్యాహ్నం 1.15 ని||లకు సిధ్ధిపోందారు.


ఆ త్యాగమూర్తిని గురించి పింగళి వేంకటకృష్ణారావు గారు చెప్పిన పద్యం అక్షరసత్యం.

"స్వార్థ మెరుగని సౌమ్యసౌభాగ్యమూర్తి

కప్పురంపు కళికవొలె కరిగితాను

వెలుగునిచ్చెను. తనభక్త వితతికెల్ల

అట్టి త్రిపురాంబ మనకెల్ల నాశ్రయంబు".అలానే వి.వి.సత్యప్రసాద్ గారు త్రిపురాంబను కల్పవల్లిగా భావించారు.


శ్రీదేవి పుఙలో పులకరించిన తల్లి

వాగ్దేవి కరుణతో కాపాడు ఙనయిత్రి

త్రిపురాంబ తల్లి నీ పాదాల ప్రణతులు.