సరాల్లో 9 రోజులు మరియు అనేక ఇతర సంధర్భాలలో భక్తుల సందేహాలను గురువులు నివృత్తి గావించేవారు. వాటిలో కొన్నింటిని యిచ్చట పొందుపరచటమైనది.
ప్రశ్న
మీరు అమ్మ వారి అంశతో ఉండడం వలన, మరలా జన్మ ఎత్తాలి, ఇదే బాగుంది అని అనుకుంటున్నారు. మీ స్ధితిలో మేము ఉండలేము కనుక మళ్ళీ జన్మనెత్తి కష్టాలు ఇవన్ని అనుభవించలేము. మళ్ళీ జన్మ కావాలి అని కోరుకోలేము, జన్మ రాహిత్యాన్నే కోరుకుంటాము, ఇది తప్పా? ఒప్పా?

జవాబు: అసలు గురు సమక్షంలో ఉంటున్నప్పుడు మోక్షం కావాలి అని అనుకోవక్కర్లేదు. అలా అనుకోవడం కూడ తప్పే. గురు రక్షణలో ఉన్నప్పుడు (ఉదా: కోతి, పిల్లి, ఏనుగు) ఏ జన్మ అయితే ఏం? మానవ జన్మ అయితే ఏం? ఎన్ని కష్టాలు ఉంటే ఏంటి? నీ చేతితో నన్ను పట్టుకొని వున్నావు. అన్ని బాధలు,కష్టాలు వదిలేసి నన్ను పట్టుకొన్నావు. రత్నం ఉంటే చాలు, ఇంకేం వద్దు అనుకుంటున్నావు. నేను మీ చేత పుణ్యకార్యాలు చేయిస్తున్నాను. మీరు పాప ఖర్మ నుండి విముక్తి పొందుతున్నారు. మీకు నాకు మానసికమైన ఎటాచ్మెంట్ ఉంది. నన్ను నమ్ముకుని నాతో వస్తున్నప్పుడు మళ్ళీ మరు జన్మలో కూడా నేను ఉంటా, మీరూ ఉంటారు. మనం కలిసి ప్రయాణం చేసేప్పుడు, ఎన్ని జన్మలైతే ఏంటి? ఎక్కడ పుడితే ఏంటి? నాతో ఉండటానికి ప్రయత్నించండి.

ప్రశ్న
మన వాళ్ళు, మన రక్త స్పర్శకి ఏదైనా బాధలు, కష్టాలు వచ్చినప్పుడు అది మనకీ బాధగా ఉంటుంది కదా! ఇది కూడా మన కర్మ అనుభవించడంలో బాగమే అవుతుందా?

జవాబు: జవాబు: ఇక్కడ సాధకుడు, సాధకుడు కానివాడికి తేడా!

అమ్మవారి రక్షణలో ఉన్నవారైతే మనస్సుకు విషయాలు తీసుకొని బాధపడకూడదు. అన్నీ మన అమ్మవారే, మన గురువుగారే కాపాడుతారు అనే స్ధిర నిశ్చయంతో ఎదుర్కోవాలి. ఆ జగన్మాత రక్షణలో ఉన్నవారిని ఆ తల్లే రక్షిస్తుంది.

సాధకుడు కానివాడు, అమ్మవారి రక్షణలో లేని వారికి, మనం చేయగలిగినంత, వాళ్ళకి కావలసిన సహాయం చేసి , మిగిలింది అమ్మా నీవు వారిని బాధలనుండి విముక్తి చేయి తల్లీ అని ప్రార్ధించి వదిలేయాలి. కాని అది అంతా నీకే చెందినట్లు మళ్ళా బాధపడినన్ని రోజులు నీవు బాధపడితే అది నీవు కొని తెచ్చుకొన్న ఖర్మ.

ప్రశ్న
పాప కర్మలను అనుభవించేటప్పుడు కష్టాలు వస్తాయి. మరి పుణ్యకర్మలు అనుభవించేటప్పుడు అవి ఎలా తెలుస్తాయి?

జవాబు: జవాబు: పాపఫలం గాని, పుణ్యఫలం గాని సమానంగా తీసుకోగల స్ధిర మనస్తత్వం తెచ్చుకోవాలి సాధనద్వారా.
పాపఫలం ద్వారా కష్టాలు వస్తే కృంగిపోకూడదు, అలా అని పుణ్యఫలం వల్ల సుఖ సంతోషాలు కలిగితే పొంగి పోకూడదు. రెండిటి వల్ల కలిగే వాటిని సమానంగా పొందగలిగే స్ధిర మనస్తత్వమును సాధన ద్వారా అలవర్చుకొన్నందువల్ల కష్టం వచ్చినప్పుడు కష్టం అనిపించదు, సుఖం వల్ల సంతోషం అనిపించదు. అటువంటి మానసిక స్ధైర్యాన్ని అలవర్చుకోవాలి.

ప్రశ్న
మడి, ఆచారం లేకుండా అపరిశుభ్రం అనాచారంలా అనిపిస్తుంది అమ్మవారికి పూజ చేస్తుంటే ఏమిటి?

జవాబు:అమ్మవారు ఎందులో లేదు? నీలో ఎక్కడలేదు? నీవు చేయకూడని రోజున అమ్మవారిని తలవటం లేదా? ఇవన్నీ నీ భ్రాంతులు, ఈ మడి ఆచారాలు ఆవిడకి అంటనివి, చెందనివి, ఆ జగన్మాత పాదాల క్రింద ఆమె ఏర్పర్చినవి. పైన ఉన్న సిద్ధాంతము ప్రకారం ప్రాక్టికల్ చేస్తే తప్పు కాదు కదా? మనస్ఫూర్తిగా అమ్మవారిని తలచుకొని చెయ్యాలి. మనస్సే ప్రధానం.

ప్రశ్న
"మీరు అందరిని ప్రేమించండి వాళ్ళు మీ పట్ల ఎలా నడిచినా, మీరు సాధనలో ఉన్నవాళ్ళు కాబట్టి మీరు ఎవరిని ఏమీ అనకూడదు. అలా ఉండి సాధన చేయాలి" అని మీరు చెప్తుంటారు. ఇంట్లో వయస్సు మీరిన వారు, పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళని మేము ఎంత ప్రేమగా చూస్తున్నా వాళ్ళు అర్ధం చేసుకోరు, ఎంతైనా వాళ్ళ పద్దతి మార్చుకోరు. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు ఓర్పుగా వాళ్ళకి అర్ధం అయ్యే రీతిలో చెపుతాం, కాని వాళ్ళు ఇంకా మూర్ఖంగా నడుస్తారు. ఎపుడో ఒక్కసారిగా కోపం ఆపుకోలేక మాటలు అనేస్తాం. ఇన్నాళ్ళ నుంచి ఓపికగా ఉన్నదంతా వృధా అయిపోతున్నది. మేము ఎంత మారినా వారు గ్రహించరు ఎందుకని? ఇలా జరగటం వలన "సాధనలో వెనక్కి వెళ్ళిపోతున్నాం" అని భయం కలుగుతుంది. మీరు ఇన్ని నియమాలు ఇస్తున్నారు, మేము చేస్తున్నాం కదా! మీరు ఇచ్చే నియమాలు మాకు సాధనలో ముందుకి వెళ్ళటానికి తోడ్పడవా?

జవాబు: మీరు నియమాలు చేయుట, నా దగ్గర నియమం తీసుకోవటం అనేది, మీ మీ సమస్యలు పరిష్కరించుకోవటానికో లేక మీ మీ పాప ఖర్మలు తగ్గించుటకో చేయబడుతున్నది. సాధన మార్గం వేరు, నియమాల మార్గం వేరు. రెండూ వేరు వేరు. సాధనలో ఉన్నవాళ్ళకి, సాధనలో లేనివాళ్ళకి తేడా ఎప్పుడూ ఉంటుంది. మీ మార్పు వాళ్ళు గ్రహించలేరు. మీకు ఉన్న జ్ఞానం, సాధనలో లేని వారికి ఉండదు. సాధనలో ఉండగా ఇలాంటి నెగటివ్ సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సాధన చేయుటవలన మీరు త్వరత్వరగా ముందుకు వెళ్ళగలుగుతారు.

ప్రశ్న
గురువు ఎలా దొరుకుతారు. గురువుని శిష్యుడు ఎలా గుర్తు పట్టగలుగుతారు. వీరే సద్గురువు అని ఎలా గ్రహించగలరు?

జవాబు: గురువుని గుర్తుపట్టడానికి శిష్యుడి జ్ఞానం సరిపోదు, గురువే ఆ జ్ఞానాన్ని ప్రసాదించి, గురువుని గుర్తు పట్టేట్లు చేస్తారు. ఎంతమంది గురువుల దగ్గరికి అయినా వెళ్ళు, కాని నీవు ఏ గురువు దగ్గరికి అయితే వెళ్ళినప్పుడు ఆ గురువు సమక్షంలో ఆనందం కలిగి ఆ గురువు వల్ల పని అవుతుంది అనే నమ్మకం, ఆత్మస్ధైర్యం కలుగుతుందో, వారే నీ గురువు అని గ్రహించు. గురువు నీకు దొరకగానే నీవు 10వ మెట్టు మీద ఉన్నట్లే, నీవు నీ గురువుని గుర్తుపట్టడం అనేది 10వ మెట్టుకి వచ్చినట్లే, కాని నీవు 10వ మెట్టు అంచు మీద ఉండినట్లు, ఈ అంచు మీద నిలబడి చేసే సాధనే, గురువు దగ్గర నీవు నిలబడటానికి చేసే సాధన!

ప్రశ్న
విగ్రహాలు పీఠంలో పెట్టి పూజించుటకు గల కారణం ఏమిటి?

జవాబు: ఈ దేవీ నవరాత్రులలో ఈ పవిత్రమైన పీఠ స్ధానంలో ఉంచి పూజించటవల్ల చాలా విశేషం ఉంది. ఇది మన గురువు నివసించి, నిద్రించి, సంచరించి గడిపిన స్ధలం. వాళ్ళు సిధ్ధి పొందేముందు, కొంత తమ యొక్క యోగ శక్తిని ఈ స్ధానంలో నిక్షిప్తం చేస్తారు. ఇలా మనం పూజలు ఇంతమంది చేయటంతో ఆ యోగ శక్తి మరింత చైతన్యం పొంది, ప్రజ్వరిల్లి అనంతం అవుతుంది. అటువంటి పీఠం స్ధానంలో మనం వెండి, రాగి, పంచలోహాలతో కూడిన విగ్రహాలను ఉంచి ఈ దేవీ నవరాత్రులు దీక్షతో ఉండి ఇన్ని కుంకుమార్చనలతో పూజించటవల్ల ఆ యొక్క కిరణాలు వీటిపై ప్రసరిస్తాయి, అప్పుడు వీటిలో చైతన్యశక్తి కలుగుతుంది. సహజంగా లోహాలకి శక్తి గ్రహించటం మరియు శక్తి విడుదల చేసే లక్షణం ఉంటుంది. ఇది ఒక పవిత్ర స్ధలం మన పీఠంలోనికి మన గురువుగారి చేతి మీదుగా వచ్చినది అనేటువంటి పవిత్ర భావన మనకి కలిగి ఉండటంవల్ల ఆ శక్తి ద్విగుణీకృతం అవుతుంది. గురువు చేతి మీదుగా (చేత్తో) పుల్లముక్క ఇచ్చినా అది అత్యంత ఫలదాయకం(పవర్). పవిత్రం, విశిష్టత కలిగి ఉంటాయి.

ప్రశ్న
నీవు నాకు అమ్మమ్మవి అవునా? కాదా? అనే అలోచన నేను చెయ్యలేదు. నీవు చెప్పావు, నేను చేశాను. నన్ను ఈ రకంగా అనుగ్రహించావు. మరి అమ్మమ్మనే నమ్ముకున్న వాళ్ళు, కమలమ్మ గారి టైమ్ లో ఉన్నవాళ్ళు, ఇప్పటికీ అమ్మమ్మనే నమ్ముకుంది. ఆవిడ పీఠంలో ఉన్న వ్యక్తే మరి నీలోను ఉన్నది అమ్మమ్మే, వారు నమ్ముకున్నది అమ్మమ్మనే కదా! మరి వారిని ఎందుకు అనుగ్రహించుటలేదు? నీవు అమ్మమ్మ గారివే కదా? శరీరం మారింది కాని మరి అనుగ్రహం ఉండాలి కదా! పీఠంలో మటుకే కాకుండా కంటిన్యూ అవ్వాలి కదా నీ అనుగ్రహం?

జవాబు: అమ్మమ్మగారు ఉన్న రోజుల్లో అప్పుడు ఆవిడ శిష్యురాలు. అమ్మమ్మ గారు గురువుగారు. అప్పుడు అమ్మమ్మగారి అనుగ్రహం అలా డైరెక్ట్ గా పాస్ అయ్యింది. ఈవిడకు పిన్నిగారు అనే భావంతో ఉంది. నేను దేహం మారినప్పుడు, నేను అమ్మమ్మగార్ని అయినప్పుడు ఆవిడ నన్ను అమ్మమ్మగారిగా గుర్తించగలిగిందా? నేను అమ్మమ్మగారిగా అయినప్పుడు నన్ను అమ్మమ్మగారిగా చూసిందా? నేను చెప్పక్కర్లేదు, నన్ను చూసి రత్నం అమ్మమ్మగారే అని వేలాదిమంది అంటున్నారు. ఎలా అంటున్నారు? తెలీదు? మరి ఆవిడ ఎందుకు అనలేకపోతున్నా అని అనుకోవట్లేదు. అమ్మమ్మగారి అనుగ్రహంతోటే రత్నం చేస్తోంది అనే భావన ఆవిడకి ఎందుకు కలగలేదు? ఆవిడ అమ్మమ్మగారిని ఆశ్రయించినట్లు నన్ను ఎందుకు ఆశ్రయించట్లేదు? నన్ను గుర్తించనపుడు నేను ఏమి చేయను? అది నీవు వెతుక్కోవాలి. నీవు ఫొటోలో మాత్రమే వెతుక్కుంటున్నావు. నీకు ఈ జన్మకి ఫొటోలో వెతుక్కుని మాట చెప్పుకోవటం మాత్రమే ఉంది. ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ వెనకే తిరిగావు. నీవు గుర్తించనపుడు, నిన్ను గుర్తించే ప్రయత్నం నేనెందుకు చేయాలి? నామీద ఇప్పుడు నమ్మకం ఉందా? నేను చెపితే నమ్మకం లేదు, అలాంటప్పుడు నేనెలా చెపుతాను. నమ్మకం లేని చోట అనుగ్రహం లేదు. నీవు డబ్బులు ఒక చోట పడేసి, ఇంకొక చోట వెతుకుతున్నావు. నన్నడిగితే అక్కడ కాదమ్మా ఇక్కడ ఫలానా చోట ఉన్నాయి నీ డబ్బులు అని చెపుతాను. నీవు అన్నీ చూస్తున్నావు కాని నన్ను అడగటంలేదు. రత్నం చాలా కృషి చేస్తోంది అంటే రత్నంగానే కనపడతాను, కమలమ్మగారు అనుకొంటే అలా కనపడతాను. నన్ను నీవు ఎలా చూస్తే నిన్ను నేను అలాగే అనుగ్రహిస్తాను.

ప్రశ్న
మనం నియమం చేసుకుంటున్నాం కదా! ఎదుటి వారు మనల్ని బాధించకుండా వాళ్ళు మారేలాగా వాళ్ళకోసం మనం నియమం చేయవచ్చు కదా?

జవాబు: జ్ఞానం అనేది వ్యక్తిగతమైన సాధన. నీ చిత్త సాధన నీది. వాడి చిత్తాన్ని చీపురు పెట్టి తుడిచేయలేవు. చిత్తశుద్ధి చేసుకొనేది జ్ఞానమార్గం. జ్ఞానమార్గంలో మన ఇంద్రియ నిగ్రహం మనం నిగ్రహించుకోవాలి. అవతలవాడి ఇంద్రియ నిగ్రహం నీవు ఎలా సాధన చేస్తావు. భౌతికపరమైన దోసకాయ పచ్చడి అందరికి చేసి పెడతావు, కాని దోసకాయ పచ్చడి తినాలి అంటే వాడి పళ్ళు పని చేయాలి, అది నీవెలా చేస్తావు? వాడి పళ్ళు పనిచేసేలా నీవెలా నియమంచేస్తావు? జ్ఞానానికి సంభందించినవి, చిత్తశుద్ధికి సంభందించినవి ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. ఎవరివి వాళ్ళే తినాలి. ఎవరి మనస్సును వారు శుద్ధి చేసుకోవాలి. ఎవరి అనుభూతి వారు పొందాలి. మోక్షస్ధితి, జ్ఞానస్ట్ఢితి అనేవి వేర్వేరు స్ధితులు. ఆనందానుభూతులు ఎవరికి వాళ్ళే పొందవలసిన స్ధితులు. ఇంకొకరి గురించి చేసేవి కావు. చిత్తశుద్ధి చేసుకోవలసిన వాడు గురు వాక్యాన్నిపాటించాలి. నీ కోపం, ద్వేషం, అసూయ ఎలా తగ్గించుకోవాలో నీవు చూసుకో.
ఇప్పుడు అది కాఫీ కలపనా అంది, మనందరం ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం. కాఫీ కలిపాను, కాఫీ తాగుతారా, కాఫీ ఇచ్చి వదిలేయాలి. కాని మీరు ఈ మధ్య కాఫీ పెట్టటం కూడా మర్చిపోయారు, నేనే కాఫీ పెట్టాను అనే దిక్కుమాలిన ఆలోచన రాకూడదు, ఉండకూడదు. అలా దెప్పుడుగా, సాధింపుగా ఎంచుకున్నా ఆ కాపీ ఇచ్చిన ఫలితం పోతుంది. అలా ప్రక్కన కూడా అనుకోకూడదు

ప్రశ్న
తామరాకు మీద నీటి బొట్టులాగ ఉండి, సంకల్పరహితంగా పుణ్య కార్యాలు చేస్తారు కదా? ఇలా చేస్తే వాటియొక్క పుణ్య ఫలితం వాళ్ళకి ఉంటుందా? అది ఎలా ఉంటుంది? అంటే ఏదైనా సంకల్పంతో చేస్తేనే కదా అది మనకు అంటేది. సంకల్పరహితంగా చేస్తే పుణ్య కార్యాల ఫలితాలు ఎలా ఉంటాయి?

జవాబు: తామరాకు మీద నీటి బొట్టులాగ ఉండి సంకల్పరహిత చర్యలు ఎవరు చేస్తారు. జీవన్ముక్తులు చేస్తారు. వాళ్ళకి ఆరామీ లేదు, సంచితం లేదు. దాని యొక్క ఫలితం అంటదు. చిత్తశుద్దితో చేస్తారు కనుక ఆటోమెటిక్ గా ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. విజయవంతం అవుతుంది. నెగెటివ్ రిజల్ట్ రాదు. అయితే జీవన్ముక్తులు అయిన జీవి చేసే సంకల్పరహిత చర్యలు ప్రపంచానికి అవుతుంది. కాని దాని వల్ల వచ్చే పాపం, పుణ్యం ఫలితం కూడా అంటవు, వాడికేది చెందవు. నీవు వాళ్ళయొక్క సంకల్పరహితంగా చేసే పుణ్యకార్యాల యొక్క ఫలితం ఉంటుంది అనుకుంటున్నావు కాని ఏమి ఉండవు.
మరి వాళ్ళకి చెడు కర్మ మిగిలి ఉంది అనుకో, వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు?
అసలు జీవన్ముక్తులు అంటే ఎవరు? వెనక్కి వెళ్ళి ఒకసారి ముక్తి పొందిన వారే మళ్ళీ పుడతారు. మరి నాకు 26 ఏళ్ళకే పూర్తి అయిపోయింది. ఈ పుణ్యకార్యాలు చేయనప్పుడు మామూలుగా ఉన్నప్పుడు జీవితంలో ఏవైతే అనుభవించాలో ఆయొక్క కర్మ అయిపోవాలి. నేను కర్మ అనుభవించేటప్పుడు, ఇంకొకళ్ళకి మంచి సంకల్పం ఏంచేస్తాను? నేను ఇక్కడ శుద్ది అయితే గాని ఇంకొకళ్ళకి ఏం చేయగలుగుతాను? నా కర్తవ్యం పూర్తి అయిన తరువాతే నాకు రెండవ రోల్ ప్రారంభం అయింది. ఈ రొల్ లో నేను చేస్తే వాటివి ఏవి నాకు అంటవు. నేను కర్మ అనుభవించేటప్పుడు అవి అయిపోయిన తరువాత పుణ్యకార్యాలు చేయటం ఆరంభమైనది

ప్రశ్న
సద్గురువు అయిన వాళ్ళకి అనారోగ్యం ఎందుకు రావాలి? వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు వస్తుంది అనారోగ్యం?

జవాబు: అనారోగ్యం అనేది శారీరకమైనది. శరీరానికి భౌతిక ధర్మాలు ఉన్నాయి. శరీరానికి పోషణ కావాలి. శరీరానికి కొన్ని సపర్యలు చేయాలి. శరీరానికి క్షీణించడం అనేది ఉంటుంది. తగ్గటం పెరగటం అనేది ఉంటుంది. శరీర ధర్మాలు అవి. ఒక యంత్రం ఎన్నాళ్ళు పని చేస్తుంది? వయస్సుతో పాటు క్షీణిస్తుంది. శరీరం అశాశ్వతమైనది. మాకు అంటే చాలా ఘోరమైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి.

మీరు ఇంత పుణ్యం చేస్తారు. నిరంతరం అమ్మవారి ధ్యానంలో ఇన్ని చేస్తూ ఉంటే మీకు రాకూడదు కదా?
ఇప్పుడు సధ్గురువు ఉన్నాడు, మరి భౌతికపరమైన గృహస్ధాశ్రమ ధర్మాలు పాటించడం లేదా? పిల్లల్ని కనడం, పెంచడం ఇవన్నీ చేస్తున్నారు కదా. సధ్గురువు అయినా కనకుండా పిల్లలు పుట్టడం లేదు కదా? అలాగె తింటున్నాం, తిరుగుతున్నాము. మీలో మనుషుల్లాగ నటిస్తున్నాము, అటువంటప్పుడు శారీరక ధర్మాలు ఉంటాయి.

మరి అనారోగ్యం వచ్చినప్పుడు త్వరగా తగ్గిపొవాలి కదా? అలా కాకుండా చాలా రోజులు అలా అనారోగ్యంతో ఉండిపోతున్నారు ఎందుకు?

గురువులకి అనారోగ్యం రాకూడదు అనేమి లేదు. గురువుల అనారోగ్యాలు డిఫరెంట్ గా ఉంటాయి. శారిరకమైన తాత్కాలిక అనారోగ్యాలు కొన్ని ఉంటాయి. కొన్ని శిష్యుల అనారోగ్యాలు, ఆ కర్మలు గురువులు తీస్తూ ఉంటారు. కొంత గురువులు తీసేస్తూ ఉంటారు కనుక ఎక్కువ మందిని రియలైజ్ చేసినప్పుడు అవి బయటకు పోగొడతారు, అవి గురువుల మీదకి తీసుకొంటారు. అవి ఒక రకం. కొన్ని గురువులకి ధీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటాయి

ప్రశ్న
జ్ఞాని ఆచరణలో ఉన్న జ్ఞాని అయినవాడు ఒక దేవుడ్ని బాగా నమ్మి మిగతా దేవుళ్ళని పట్టుకోడు, మరి వాడు జ్ఞాని ఎలా అవుతాడు?

జవాబు: జ్ఞాని అయినవాడు ఒక్క దేవుడ్ని పట్టుకొని ఆ సాధనలో ముందుకు సాగుతాడు. ఏదో ఒక్కటే ఉంది అని నమ్మి సాగుతాడో వాడే జ్ఞాని. మిగిలిన దేవుళ్ళు ఉన్నారు అనే భావం లేకుండా అంతా ఒక్కటే శక్తి అని తెలుసుకున్నవాడు జ్ఞాని. అక్కడ అందరి దేవుళ్ళలోను ఒక్కటే శక్తి చూస్తాడు. ఏ పేరుతో పిలుచుకుంటారో అదే తేడా కాని శక్తి అంతా ఒక్కటే!

ప్రశ్న
ఆచరణలో గురువుగారు చెప్పింది చేశాము అని గుడ్డిగా చేసేస్తారు కొందరు. ఇంకొందరు సమస్య అర్దం చేసుకుని చేస్తారు. వాళ్ళకి వీళ్ళకి ఏమైనా తేడా ఉందా? ఈ రెండు మార్గాలలో ఏది మంచిది? లాభ నష్టాలు ఏమిటి?

జవాబు: గుడ్డిగా వెళ్ళేదానికంటే తెలుసుకొని చేయటం మంచిది. జ్ఞానం తోటి ఆచరణ చేయాలి. తెలిసి రామచింతన చేయాలి